ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కేవలం 31.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మార్నస్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.