చాపెల్ చెత్త కోచింగ్ కారణంగా 2007 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. ఆ వెంటనే కోచింగ్ పదవి నుంచి చాపెల్ దిగిపోయాడు. 2005 నుంచి 2007 మధ్య కోచ్ గా ఉంటూనే టీమిండియా వెనుక గోతులు తవ్వాడు చాపెల్. ఒకరకంగా చెప్పాలంటే తన అనాలోచిత నిర్ణయాలతో గొప్పగా ఉన్న జట్టును నాశనం చేసి వెళ్లాడు.