IND vs AUS : భారత్ ప్రధాన సమస్య ఇదే..ఆ ప్లేయర్ టెస్టుల్లో కూడా కమ్ బ్యాక్ చేస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు
IND vs AUS : భారత్ ప్రధాన సమస్య ఇదే..ఆ ప్లేయర్ టెస్టుల్లో కూడా కమ్ బ్యాక్ చేస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు
IND vs AUS : తొలి టెస్టుకు ముందు టీమిండియాను ఒక సమస్య వెంటాడుతోంది. టెస్టుల్లో భారత్ ను ఆల్ రౌండర్ సమస్య వేధిస్తోంది. అదేంటి.. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ రూపాల్లో ఆల్ రౌండర్లు ఉన్నారే అని మీరు అనుకోవచ్చు.
ఆస్ట్రేలియా (Australia)తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా (Team India) సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ గావస్కర్ (Border Gavaskar Test Series) సిరీస్ ఆరంభం కానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC)లో భారత్ ఫైనల్ కు చేరాలంటే ఇందులో గెలవాల్సి ఉంది.
2/ 8
తొలి టెస్టుకు ముందు టీమిండియాను ఒక సమస్య వెంటాడుతోంది. టెస్టుల్లో భారత్ ను ఆల్ రౌండర్ సమస్య వేధిస్తోంది. అదేంటి.. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ రూపాల్లో ఆల్ రౌండర్లు ఉన్నారే అని మీరు అనుకోవచ్చు.
3/ 8
అయితే వీరంతా స్పిన్ ఆల్ రౌండర్లు.. భారత్ ను పేస్ ఆల్ రౌండర్ సమస్య వెంటాడుతోంది. హార్దిక్ పాండ్యా టెస్టుల్లో కూడా కమ్ బ్యాక్ చేస్తే.. ఈ సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.
4/ 8
అప్పుడు స్వేదేశంలో జరిగే టెస్టు సిరీస్ ల కోసం భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే సరిపోతుంది. మూడో పేసర్ గా ఆల్ రౌండర్ ఉండనే ఉంటాడు. అటువంటి సమయంలో భారత్ పిచ్ స్వభావాన్ని బట్టి ఎక్స్ ట్రా స్పిన్నర్ లేదా బ్యాటర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది.
5/ 8
గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టి20, వన్డేలను ఆడుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అతడు బ్యాటర్ గా, బౌలర్ గా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. అతడు టెస్టుల్లో కూడా కమ్ బ్యాక్ చేస్తే టీమిండియా టెస్టు జట్టు మరింత బలంగా మారుతుంది.
6/ 8
అయితే ఇటువంటి పరిస్థితిల్లో ఒక పేస్ ఆల్ రౌండర్ ను టెస్టుల కోసం సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శార్దుల్ ఠాకూర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. దీపక్ చహర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు.
7/ 8
అయితే ఇటువంటి పరిస్థితిల్లో ఒక పేస్ ఆల్ రౌండర్ ను టెస్టుల కోసం సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శార్దుల్ ఠాకూర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. దీపక్ చహర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు.
8/ 8
అయితే శివమ్ మావి రూపంలో భారత్ కు ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. ఇటీవలె టి20 సిరీస్ ల్లో శివమ్ మావి బ్యాట్ తోనూ రాణించాడు. ఈ క్రమంలో అతడికి టెస్టుల్లో అవకాశాలు ఇస్తే భారత్ కు ఒక ఆల్ రౌండర్ దొరికే అవకాశం ఉంటుంది.