IND vs AUS : సూర్యకుమార్ యాదవ్ కు ప్రమోషన్.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర
IND vs AUS : సూర్యకుమార్ యాదవ్ కు ప్రమోషన్.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర
IND vs AUS : ఇప్పటికే టి20, వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ ద్వారా టెస్టుల్లో కూడా డెబ్యూ చేశాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టైమ్ నడుస్తోంది. లేటు వయసులో టీమిండియా (Team India) తరఫున అరంగేట్రం చేసిన ఈ మిస్టర్ 360.. తక్కువ సయమంలోనే ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయాడు.
2/ 7
ఇప్పటికే టి20, వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ ద్వారా టెస్టుల్లో కూడా డెబ్యూ చేశాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
3/ 7
30 ఏళ్లు దాటిన తర్వాత మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 30 ఏళ్ల 181 రోజుల్లో టి20ల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో 30 ఏళ్ల 307 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చాడు.
4/ 7
ఇక తాజాగా 32 ఏళ్ల 148 రోజుల వయసులో టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసి రికార్డులకు ఎక్కాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు టి20ల్లో మాత్రమే తన మార్కును ప్రదర్శించాడు.
5/ 7
వన్డేల్లో అవకాశాలు వస్తున్నా పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై వన్డే సిరీస్ లను ఆడిన పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్ లో ఏ విధంగా ఆడతాడో చూడాలి.
6/ 7
సూర్యకుమార్ యాదవ్ తో పాటు వైజాగ్ కుర్రాడు శ్రీకర్ భరత్ కూడా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రిషభ్ పంత్ గాయపడటంతో రెండో వికెట్ కీపర్ గా ఉన్న భరత్ కు టెస్టుల్లో అవకావశం వచ్చింది.
7/ 7
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 63.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు.