IND vs AUS : గొప్పలకు పోయి బొక్క బోర్లా పడ్డ ప్రపంచ నెం.1.. అక్కడుంది అల్లా టప్పా బౌలర్ కాదు
IND vs AUS : గొప్పలకు పోయి బొక్క బోర్లా పడ్డ ప్రపంచ నెం.1.. అక్కడుంది అల్లా టప్పా బౌలర్ కాదు
IND vs AUS : ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కూడా ధాటిగా తన ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే భారత పేసర్లు సిరాజ్, మొహమ్మద్ షమీలు దెబ్బ తీశారు.
ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ 1 బ్యాటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్యూ చేసిన నాటి నుంచి అద్భుత ఫామ్ తో కంటిన్యూ అవుతున్నాడు.
2/ 8
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కూడా ధాటిగా తన ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే భారత పేసర్లు సిరాజ్, మొహమ్మద్ షమీలు దెబ్బ తీశారు. (PC : TWITTER)
3/ 8
దాంతో ఆస్ట్రేలియా తొలి సెషన్ లో 3 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ ను లబుషేన్ ఆదుకున్నాడు. స్టీవ్ స్మిత్ తో కలిసి మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ కు ఆస్ట్రేలియాను తీసుకెళ్లాడు. (PC : TWITTER)
4/ 8
భారత స్పిన్ ను ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా లబుషేన్ ఎదుర్కొన్నాడు. ధాటిగా ఆడుతూ పరుగులు సాధించాడు. దాంతో లబుషేన్ లో ఆత్మవిశ్వాసం ఎక్కువైంది. నిజాయితీగా చెప్పాలంటే అతి విశ్వాసంతో రెండో సెషన్ లో కనిపించాడు. (PC : TWITTER)
5/ 8
భారత స్పిన్ ను ఆడటం తనకు పెద్ద కష్టం కాదనే ధోరణిలో రెండో సెషన్ లో లబుషేన్ కనిపించాడు. ఈ క్రమంలో వికెట్లను వదిలి ఆడటం.. లేదంటే లేట్ గా కట్ షాట్స్ ఆడటం చేశాడు. ఇంకొన్ని సార్లు పిచ్ ముందుకు వస్తూ ఆడాడు. (PC : TWITTER)
6/ 8
ఈ ఓవర్ కాన్ఫిడెన్సే లబుషేన్ ఆటను కట్టించింది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఏ మాత్రం ఫుట్ వర్క్.. బ్యాలెన్స్ లేకుండా ఫ్రంట్ ఫుట్ పై షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జడేజా బంతి లబుషేన్ ను బోల్తా కొట్టిస్తూ వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. (PC : TWITTER)
7/ 8
ఏ మాత్రం బ్యాలెన్స్ లేని లబుషేన్ షాట్ ను ఆడే క్రమంలో క్రీజు బయటకు వచ్చేశాడు. బంతి అతడిని బీట్ చేస్తూ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లోకి వెళ్లింది. ఎటువంటి తప్పు చేయకుండా క్షణాల్లో వికెట్లను గిరాటేసిన భరత్ లుబుషేన్ ను స్టంపౌట్ చేశాడు. (PC : TWITTER)
8/ 8
అంతే అంత వరకు అద్బుతంగా ఆడుతూ వచ్చిన లబుషేన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లి 49 పరుగుల వద్ద వికెట్ ను పారేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే రేన్ షా (0)ను జడేజా ఎల్బీ చేశాడు. కాసేపటికే కీలకమైన స్మిత్ ను క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా.. టీమిండియాకు వెంట వెంటనే 3 వికెట్లను అందించాడు. (PC : TWITTER)