IND vs AUS : అశ్విన్ కాదు.. ఆస్ట్రేలియా భరతం పట్టేది ఈ ఇద్దరే.. అవుటాఫ్ సిలబస్ ప్రశ్నలకు ఆసీస్ కు చుక్కలే
IND vs AUS : అశ్విన్ కాదు.. ఆస్ట్రేలియా భరతం పట్టేది ఈ ఇద్దరే.. అవుటాఫ్ సిలబస్ ప్రశ్నలకు ఆసీస్ కు చుక్కలే
IND vs AUS : ఫిబ్రవరి 9 నుంచి నాగ్ పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం మార్చి 22 వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ కూడా జరగనుంది.
భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య రెండు నెలల పాటు జరిగే క్రికెట్ సమరం అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. టెస్టు సిరీస్ అయినా సరే భారత్, ఆస్ట్రేలియా పోరును చూసేందుకు ఇరు దేశాల అభిమానులు సిద్ధంగా ఉన్నారు.
2/ 8
ఫిబ్రవరి 9 నుంచి నాగ్ పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం మార్చి 22 వరకు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ కూడా జరగనుంది.
3/ 8
ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్ కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్ లో చెమటోడుస్తుంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. భారత వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా రచించింది.
4/ 8
అచ్చం అశ్విన్ ను పోలిన యాక్షన్ తో బౌలింగ్ చేసే బరోడా ప్లేయర్ మహేశ్ పితియాతో కలిసి నెట్స్ లో ఆసీస్ బ్యాటర్లు సాధన చేస్తున్నారు. అశ్విన్ డూప్ అని మహేశ్ కు పేరు. మహేశ్ బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తే చాలు అశ్విన్ ను ఎదుర్కోగలం అనే భ్రమల్లో ఆసీస్ ఉండటం గమనార్హం.
5/ 8
అయితే ఈ బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా భరతం పట్టే టీమిండియా బౌలర్లు వేరే ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బౌలర్లు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఒకరు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కాగా.. మరో బౌలర్ మొహమ్మద్ సిరాజ్.
6/ 8
అటు కుల్దీప్ యాదవ్.. ఇటు సిరాజ్ లు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా చైనామన్ బౌలర్ అయిన కుల్దీప్ ను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు అంత సులభమైన విషయం కాదు. అయితే ఆసీస్ ప్రస్తుతం అశ్విన్ ను ఎలా ఎదుర్కోవాలో అన్న ఆలోచన మీదే ఉంది.
7/ 8
ఇక వారి ధ్యాస అలాగే ఉండాలా మన మాజీ క్రికెటర్లు చేస్తున్నారు. ఒక్క మ్యాచ్ జరగకుండానే ఆసీస్ ను అశ్విన్ వణికిస్తున్నాడంటూ మన మాజీలు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో అశ్విన్ అనే సిలబస్ ను మాత్రమే ఆసీస్ ప్రస్తుతం స్టడీ చేస్తోంది.
8/ 8
సిరీస్ స్టార్ట్ అయ్యాక సిరాజ్, కుల్దీప్ లాంటి అవుటాఫ్ సిలబస్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.