నాగ్ పూర్ (Nagpur) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 139.3 ఓవర్లలో 400 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగితే.. రవీంద్ర జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు; 1 సిక్స్) మిగతా పనిని పూర్తి చేశారు. (PC : BCCI)