IND vs AUS : తొలి రోజే మొదలైన మైండ్ గేమ్స్.. లబుషేన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అశ్విన్.. అసలేం జరిగిందంటే?
IND vs AUS : తొలి రోజే మొదలైన మైండ్ గేమ్స్.. లబుషేన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అశ్విన్.. అసలేం జరిగిందంటే?
IND vs AUS 1st Test : వచ్చీ రావడంతో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టారు. స్పిన్ ట్రాక్ లంటూ ఆ దేశ మీడియా కూడా గత కొన్ని రోజులగా భారత్ పై ఏడుస్తూనే ఉంది.
మైండ్ గేమ్స్ (Mind Games) ఆడటంలో ఆస్ట్రేలియా (Australia) తర్వాతే ఎవరైనా. స్వదేశంలో ఆడుతున్నా.. విదేశాల్లో ఆడుతున్నా తమ నోటికి పని చెప్పడంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎప్పుడూ ముందుంటారు. (PC : TWITTER)
2/ 8
ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా లాంటి జట్లతో సిరీస్ లు ఆడుతున్నారంటే నోటికి పని చెప్పడంలో మరింత దూకుడును కనబరుస్తుంది ఆసీస్. తాజాగా భారత్ తో సిరీస్ ఆడేందుకు కంగారూలు ఇండియాకు వచ్చారు. (PC : TWITTER)
3/ 8
వచ్చీ రావడంతో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టారు. స్పిన్ ట్రాక్ లంటూ ఆ దేశ మీడియా కూడా గత కొన్ని రోజులగా భారత్ పై ఏడుస్తూనే ఉంది. (PC : TWITTER)
4/ 8
ఇక నాగ్ పూర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు తొలి రోజు ఆటలోనే ఇరు జట్ల ప్లేయర్ల మధ్య మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా అశ్విన్, లబుషేన్ మధ్య జరిగిన మైండ్ గేమ్స్ అభిమానులకు వినోదాన్ని పంచింది. (PC : TWITTER)
5/ 8
అశ్విన్ వేసిన ఒక బంతి పిచ్ అయ్యి అనూహ్య బౌన్స్, టర్న్ తో లబుషేన్ ను ఇబ్బంది పెట్టింది. దాంతో అశ్విన్ ను చూస్తూ టర్న్ అవుతుంది అన్నట్లు చేత్తో సైగలు చేస్తాడు. ఇక్కడ టర్నే అవుతుందన్నట్లు అశ్విన్ సైగలతో బదులిస్తాడు. (PC : TWITTER)
6/ 8
ఇక స్టీవ్ స్మిత్ కూడా తన ట్రేడ్ మార్క్ ‘నో కాల్’తో మరోసారి భారత బౌలర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. షాట్ ఆడిన తర్వాత సింగిల్ వద్దంటూ నాన్ స్ట్రయికర్ ఎండ్ కు ‘నో’ అని అరిచి చెప్పడం స్మిత్ కు అలవాటు. (PC : TWITTER)
7/ 8
ఈ సమయంలో స్మిత్ తన బ్యాట్ ను నేరుగా బౌలర్ వైపు చూపుతూ గట్టిగా అరవడం చేస్తూ ఉంటాడు. ఇక జడేజా వేసిన ఒక బంతి స్మిత్ ను బీట్ చేస్తూ వెళుతుంది. వికెట్లపై నుంచి వెళుతుంది. జడేజాను మెచ్చుకుంటూ థమ్స్ అప్ కూడా చూపిస్తాడు స్మిత్. (PC : TWITTER)
8/ 8
బ్యాటింగ్ లో విఫలమైన ఆస్ట్రేలియా ప్లేయర్లు.. వింత వింత సైగలతో మాత్రం అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ముఖ్యంగా అశ్విన్, లుబషేన్ మధ్య జరిగిన సైగల యుద్ధం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. (PC : TWITTER)