IND vs AUS : సిరీస్ ఆరంభానికి ముందే డీలా.. ఇప్పటికే ఇద్దరు.. మరో ఇద్దరికి కూడా అదే జరిగితే ఆసీస్ కథ ముగిసినట్లే
IND vs AUS : సిరీస్ ఆరంభానికి ముందే డీలా.. ఇప్పటికే ఇద్దరు.. మరో ఇద్దరికి కూడా అదే జరిగితే ఆసీస్ కథ ముగిసినట్లే
IND vs AUS : భారత్ కు చేరుకున్న ఆస్ట్రేలియా వెంటనే కసరత్తులను ఆరంభించేసింది. స్పిన్ ట్రాక్ లపై కఠోరంగా శ్రమిస్తోంది. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తో కూడాని భారత స్పిన్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు నెట్స్ లో చెమటోడుస్తుంది.
అగ్ని పరీక్ష లాంటి టెస్టు సిరీస్ అంటూ టీవీల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia Test Series) టెస్టు సిరీస్ పై విపరీతమైన ప్రచారం జరుగుతుంది. టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్, నంబర్ 2 గా ఉన్న జట్ల మధ్య సిరీస్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.
2/ 8
భారత్ కు చేరుకున్న ఆస్ట్రేలియా వెంటనే కసరత్తులను ఆరంభించేసింది. స్పిన్ ట్రాక్ లపై కఠోరంగా శ్రమిస్తోంది. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తో కూడాని భారత స్పిన్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు నెట్స్ లో చెమటోడుస్తుంది.
3/ 8
ఇంత కష్టపడుతున్నా ఆస్ట్రేలియాకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో గాయపడ్డ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పటి వరకు కోలుకోలేదు.
4/ 8
అతడి చేతి గాయం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో అతడు తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఆదివారం ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. గాయంతో జాష్ హేజల్ వుడ్ కూడా తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు.
5/ 8
అటు స్టార్క్, ఇటు హేజల్ వుడ్ తొలి టెస్టుకు మాత్రమే దూరమయ్యారని ప్రస్తుతానికి చెబుతున్నారు. అయితే గాయం తీవ్రంగా ఉంటే వారు మరికొన్ని రోజుల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.
6/ 8
18 మంది సభ్యులతో అడుగుపెట్టిన జట్టులో అప్పుడే రెండు వికెట్లు పడ్డాయి. అది కూడా స్టార్ పేసర్లవి. ఇప్పుడు వారి బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ రూపంలో మాత్రమే అనుభవం ఉన్న బౌలర్.
7/ 8
ఈ క్రమంలో టీమిండియా అభిమానులు ఆస్ట్రేలియాపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇద్దరు గాయపడ్డారు. మరో ఇద్దరు గాయపడితే మాత్రం ఆస్ట్రేలియా కథ ముగిసినట్లే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
8/ 8
అంతేకాకుండా తర్వాత గాయపడే ప్లేయర్లలో కమిన్స్, స్మిత్, లబుషేన్ లు లేకుండా చేసుకోండి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా ఈ నెల 9 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది.