అక్షర్ పటేల్ ను ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఎదుర్కొనలేదని.. కొంత మంది ఆడినా అది టి20 సిరీస్ లో అని తెలిపాడు. గతేడాది టి20 ప్రపంచకప్ ముందు జరిగిన టి20 సిరీస్ లో అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టిన సంగతిని వాట్సన్ గుర్తు చేశాడు. అక్షర్ పటేల్ 8 టెస్టుల్లో ఏకంగా 47 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ను ఆడాలంటే ప్రాక్టీస్ ఒక్కటే సరిపోదని గట్స్ కూడా ఉండాలని వాట్సన్ పరోక్షంగా ఆసీస్ ను హెచ్చరించాడు.