యువ ప్లేయర్ల మోజులో సీనియర్ ప్లేయర్లను విమర్శించడం తగదని కైఫ్ పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు సగటు వయసు 31 ఏళ్లు అని కైఫ్ గుర్తు చేశాడు. ఒక్కో సిరీస్ కు ఒక్కో జట్టుతో కాకుండా స్పష్టమైన జట్టుతో సిరీస్ లు ఆడాలంటూ బీసీసీఐకి హితవు పిలికాడు. మరి కైఫ్ మాటలను బీసీసీఐ పట్టించుకుంటుందో లేకపోతే ఒక్కో సిరీస్ కు ఒక్కో కొత్త జట్టుతో బరిలోకి దిగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.