MI vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై మధ్య సూపర్ మ్యాచ్... హైలెట్స్ ఇవే...
MI vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై మధ్య సూపర్ మ్యాచ్... హైలెట్స్ ఇవే...
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించింది. ఓవర్, ఓవర్‌కీ చేతులు మారిన ఆధిపత్యం, చివరి బంతి దాకా కొనసాగిన ఉత్కంఠ... స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీలో వీక్షించిన వారికి కూడా కావాల్సినంత మజాను అందించింది. మనీశ్ పాండే అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను టైగా ముగిస్తే... సూపర్ ఓవర్లో మొదటి బంతికే అతను అవుట్ కావడం హైదరాబాద్ కొంపముంచింది. ఎస్ఆర్హెచ్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ హైలెట్స్ ఇవే...
ఛేజింగ్‌లో చివరి బంతికి సిక్స్ బాది, మ్యాచ్‌ను టై చేసిన మనీశ్ పాండేకు రషీద్ ఖాన్ ఆత్మీయ ఆలింగం... చివరి ఓవర్ వేసిన ముంబై బౌలర్ హర్దిక్ పాండ్యా చిరునవ్వులు...
2/ 11
47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మనీశ్ పాండే. 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు... మ్యాచ్‌ను టై చేసుకోగలిగందంటే దానికి కారణం మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్సే...
3/ 11
వికెట్ తీసిన ఆనందంలో ముంబై ట్టు ఆటగాళ్లు... ఆనందంలో కేరింతలు కొడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, కృనాల్ పాండ్యా, డి కాక్
4/ 11
58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన డికాక్‌ను రనౌట్ చేసేందుకు హైదరాబాద్ జట్టు వికెట్ కీపర్ వృద్ధమాన్ సాహా ప్రయత్నం...
5/ 11
మూడు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేయకుండా నిలువరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌కు కెప్టెన్ కేన్ విలియంసన్ అభినందన...
6/ 11
చాలారోజుల తర్వాత జట్టులో స్థానం దక్కించుకున్న వృద్ధమాన్ సాహా... 15 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
7/ 11
18 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
8/ 11
ముంబై బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమైన అద్భుత హాఫ్ సెంచరీతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు డికాక్. ఈ సీజన్లో డి కాక్కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
9/ 11
సూపర్ ఓవర్ వేసిన భారత స్టార్ బౌలర్ బుమ్రా... అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి మహ్మద్ నబీని బౌల్డ్ చేశాడు. (మొదటి బంతికే మనీశ్ పాండే రనౌట్ అయ్యాడు...)
10/ 11
9 పరుగుల విజయలక్ష్యంతో సూపర్ ఓవర్లో ఓపెనింగ్ చేసిన హర్దిక్ పాండ్యా... రషీద్ ఖాన్ వేసిన మొదటి బంతికే సిక్స్ బాదాడు.
11/ 11
రెండో బంతికి సింగిల్ రాగా... మూడో బంతికి 2 పరుగులు తీసిన పోలార్డ్... ముంబై ఇండియన్స్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్స్‌లో స్థానం ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన చివరి మ్యాచ్‌లో తప్పక గెలిస్తేనే ఫ్లేఆఫ్ రేసులో నిలుస్తుంది.