బంగ్లాపై వామప్ మ్యాచ్‌లో భారీ విజయం... టీమిండియా ఫామ్‌లోకి వచ్చినట్టేనా...
బంగ్లాపై వామప్ మ్యాచ్‌లో భారీ విజయం... టీమిండియా ఫామ్‌లోకి వచ్చినట్టేనా...
క్రికెట్ వరల్డ్ కప్ 2019: మొదటి వామప్ మ్యాచ్‌లో పటిష్ట న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విశ్వరూపం ప్రదర్శించింది. కెఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మొదటి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోవడం టీమిండియాను కలవరబెడుతున్న విషయం. అదీగాక వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు బంగ్లాపై భారీ విజయం నమోదుచేసి ఉత్సాహం నింపుకున్నా, ప్రపంచకప్ హాట్ ఫెవరేట్ అనే స్థాయి ఆటతీరును మాత్రం చూపించలేకపోయింది భారత జట్టు.
శిఖర్ ధావన్ 1 పరుగు, రోహిత్ శర్మ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరగా... విరాట్ కోహ్లీ 47 పరుగులు చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసిన కోహ్లీ, సైఫుద్దీన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
2/ 10
శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా... రోహిత్ శర్మ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
3/ 10
విజయ్ శంకర్ కూడా 2 పరుగులకే అవుట్ కావడంతో 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత ధోనీతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు కెఎల్ రాహుల్.
4/ 10
కెఎల్ రాహుల్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేయగా... మహేంద్ర సింగ్ ధోనీ 78 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు.
5/ 10
360 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టును పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తీశాడు.
6/ 10
యజ్వేంద్ర చాహాల్ మూడు వికెట్లు... కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి... బంగ్లాదేశ్ జట్టును కోలుకోనివ్వలేదు.
7/ 10
వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 94 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
8/ 10
బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 90 బంతుల్లో 10 ఫోర్లతో 73 పరుగులు చేసి... చాహాల్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
9/ 10
బంగ్లాదేశ్ జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత జట్టుకు 95 పరుగుల విజయం దక్కింది. మొదటి వామప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించి... ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
10/ 10
అయితే బంగ్లా లాంటి జట్టును కూడా 250+ దాటకుండా నిలువరించలేకపోయిన భారత జట్టు... న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ట జట్లను ఎలా నిలువరిస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.