Rohit Sharma : హిట్ మ్యాన్ లేకుంటే టీమిండియా మరీ ఇంత ఘోరమా? ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా?
Rohit Sharma : హిట్ మ్యాన్ లేకుంటే టీమిండియా మరీ ఇంత ఘోరమా? ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా?
Rohit Sharma : ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస విజయాలను భారత్ కు అందించాడు.
ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఈ పొట్టి మహా సంగ్రామంలో భారత జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. అవమానకర రీతిలో సూపర్ 12 నుంచే ఇంటి దారి పట్టింది.
2/ 6
ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరుస విజయాలను భారత్ కు అందించాడు.
3/ 6
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న టి20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిషభ్ పంత్ నాయకత్వలోని టీమిండియా తొలి టి20లో 7 వికెట్ల తేడాతో ఓడింది.
4/ 6
ఇక ఈ ఏడాది టీమిండియా 17 అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడింది. ఇందులో నాలుగు టెస్టులు, 6 వన్డేలు, 7 టి20లు ఉన్నాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. ఆరు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
5/ 6
ఇది మామూలు విషయమే అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే టీమిండియాను భయపెట్టే విషయం ఒకటి ఉంది. భారత్ గెలిచిన అన్ని మ్యాచ్ లకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఓడిపోయిన మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కెప్టెన్ గా ఉన్నారు.
6/ 6
ఈ లెక్కన రోహిత్ కెప్టెన్సీ చేసిన 11 మ్యాచ్ ల్లోనూ భారత్ నెగ్గగా.. మిగిలిన వారు కెప్టెన్సీ చేసిన ఆరు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. ఇప్పుడు ఇదే భారత్ ను భయపెడుతోంది. ఒక వేళ రోహిత్ గాయంతో మ్యాచ్ లకు దూరమైతే అప్పుడు టీమిండియా పరిస్థితి ఏంటనే వార్తలు వినిపిస్తున్నాయి.