ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది.
కోల్‌కతాలో జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు భారీ వర్షం పొంచివుంది. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడానికే అధిక అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన కోల్‌కతలో మంగళవారం నాడు భారీ వర్షం పడుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కోల్‌కతాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరోవైపు.. రాజస్థాన్ కు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం దక్కుతుంది. ఎలిమినేటర్ విజేతతో రాజస్థాన్ తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB) మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. బుధవారం నాటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైతే.. మూడో ర్యాంకర్ లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్ 2లోకి ప్రవేశించనుంది.