అంతర్జాతీయ క్రికెట్ లో ’కింగ్‘గా వెలుగొందిన కోహ్లీని విమర్శించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని గావస్కర్ అన్నాడు. అతడు 70 సెంచరీలు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎంతటి ఆటగాడికైనా కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని కోహ్లి విషయంలో కాస్త ఓపిక పట్టాలని విమర్శకులకు సూచించారు.