ICC World Cup 2019: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు అందుకున్న భారత్, సగర్వంగా 7 సారి వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ లో కి అడుగుపెట్టిన రెండో జట్టుగా పేరొందింది. అయితే 8 సార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్ దశకు వెళ్లిన జట్టుగా ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. 2019 టోర్నీలో సైతం భారత్ టైటిల్ ఫేవరట్ గా అడగుపెట్టి అదే స్థాయిలో ఏకంగా 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో ఘనవిజయం సాధించింది. (Image : Twitter)
ICC World Cup 2019: ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ ఏకంగా ఒకే టోర్నీలో 5 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అదే స్థాయిలో 647 పరుగులతో రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం టోర్నీలో 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు బాది రోహిత్ తన తిరుగులేని ఫామ్ ను మరోసారి నిరూపించుకున్నాడు. (Image : Twitter)
ICC World Cup 2019: శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (111) సెంచరీ బాది వరల్డ్ కప్ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. (Image : Twitter)
ICC World Cup 2019: శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తన ఇంటర్నేషనల్ వన్డే కెరీర్ లో 100 వికెట్ల మైలురాయిని ఈ మ్యాచులోనే అందుకోవడం విశేషం. అలాగే వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రెండవ భారతీయ క్రికెటర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. (Image : Twitter)