ఈ ప్రపంచ కప్ లో టెలివిజన్ తెరపై తళుక్కుమంటున్న మయంతి లంగర్ తన ప్రతిభతో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య అయిన మయంతి, బుల్లితెరపై తన క్రికెట్ నైపుణ్యం చాటుకోవడంతో పాటు అందచందాలు ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గడం లేదు. (Image : instagram)
అదే కోవలో ఈశా గుహ సైతం తన క్రికెట్ కామెంటరీతో అందరినీ ఆకట్టుకుంటోంది. 34 సంవత్సరాల ఈశా గుహ గతంలో ఇంగ్లాండ్ మహిళా జట్టు తరపున ఆడిన అనుభవం ఉంది. క్రికెట్ నైపుణ్యంతో పాటు గ్లామర్ ను జత చేయడంతో ఈ సారి వరల్డ్ కప్ మరింత ఆసక్తిగా మారింది.(Image : instagram)
రిధిమా పాఠక్ : స్వతహాగా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిన రిధిమా, ఈ వరల్డ్ కప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన రిధిమా, యాంకర్‌గా మంచి పేరు సంపాదించింది. (Image : instagram)
జైనబ్ ఆబ్బాస్: పాకిస్థాన్ కు చెందిన జైనబ్ అబ్బాస్.. ఈ సారి వరల్డ్ కప్ లో తన నైపుణ్యంతో పాటు అందచందాలతో ఆకట్టుకుంటోంది. పాకిస్థానీ న్యూస్ ఛానెల్స్ లో పనిచేసిన అనుభవం ఉన్న జైనబ్ అబ్బాస్, తన క్రికెట్ నైపుణ్యంతో ఆకట్టుకుంటోంది. (Image : twitter)
పెయా జన్నతుల్ : బంగ్లాదేశ్ కు చెందిన ఈ భామ క్రికెట్ స్కిల్స్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే... బంగ్లాదేశ్ టీ20 లీగ్ లో ఆకట్టుకున్న ఈ భామ ప్రపంచ కప్ లో తన యాంకరింగ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. (Image : instagram)