ICC WOMENS WORLD CUP 2022 MITHALI RAJ CREATES HISTORY AND JOINS SACHIN TENDULKAR BY PLAYING MORE NO OF WORLD CUPS SRD
Mithali Raj: శభాష్ మిథు.. సచిన్ సరసన టీమిండియా కెప్టెన్.. మహిళా క్రికెట్ లో వరల్డ్ రికార్డు..
Mithali Raj: పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj).టెస్ట్ టు వన్డే.. ఆ ఫార్మాట్.. ఈ ఫార్మాట్ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.. మన మిథాలీ ముందు పాత రికార్డులు పటాపంచలవుతున్నాయి.మన హైదరాబాదీ ఆట ముందు తేలిపోతున్నాయి.
ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ (ICC Womens World Cup 2022)లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ప్రపంచ రికార్డు సాధించింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సాధించిన రికార్డున తన పేరిట కూడా లిఖించుకుంది.
2/ 7
మౌంట్ మౌన్‌గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది.
3/ 7
ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది.
4/ 7
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు.
5/ 7
ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్ ఆడారు.
6/ 7
మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో ఆరు వన్డే ప్రపంచకప్ లు ఆడిన మూడో క్రికెటర్ గా మిథాలీ రాజ్ రికార్డు పుటల్లో స్థానం ఏర్పరుచుకుంది. సచిన్ , మియాందాద్ జావేద్ తర్వాత ఆ ఘనత సాధించింది మిథాలీనే.
7/ 7
ఇక, ఈ మ్యాచులో మిథాలీ 9 పరుగులు చేసి నిరాశపర్చింది. మిథాలీకి దాదాపు ఇదే లాస్ట్ వరల్ట్ కప్. ఈ మెగా టోర్నీ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పనుంది.