ICC Women's World Cup 2022 : లెక్క సరిచేశారు.. సగర్వంగా ఫైనల్ లోకి ఇంగ్లీష్ అమ్మాయిలు.. ఆసీస్ తో మెగా ఫైట్..
ICC Women's World Cup 2022 : లెక్క సరిచేశారు.. సగర్వంగా ఫైనల్ లోకి ఇంగ్లీష్ అమ్మాయిలు.. ఆసీస్ తో మెగా ఫైట్..
ICC Women's World Cup 2022 : మహిళల ప్రపంచకప్ లో ఈసారైనా కొత్త విజేత ను చూస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వుమెన్స్ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. లీగ్ స్టేజీలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
మహిళల ప్రపంచకప్ లో ఈసారైనా కొత్త విజేత ను చూస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వుమెన్స్ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. లీగ్ స్టేజీలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
2/ 9
లీగ్ స్టేజీలో అదరగొట్టిన దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ విధించిన 294 పరుగుల లక్ష్య ఛేధనలో.. 156 పరుగులకే ఆలౌటైంది.
3/ 9
ఫలితంగా ఇంగ్లాండ్.. 137 పరుగులతో విజయం సాధించి పైనల్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది.
4/ 9
క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వ్యాట్ (125 బంతుల్లో 129.. 12 ఫోర్లు), డంక్లీ (72 బంతుల్లో 60) , వీరికి తోడు చివర్లో ఎక్లెస్టోన్ (11 బంతుల్లో 24.. 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.
5/ 9
భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆది నుంచి తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ పది పరుగుల లోపే ఔటయ్యారు. ఆ తర్వాత లారా గుడాల్ (28), కెప్టెన్ సునె లుస్ (21), మిగ్నోన్ డుప్రీజ్ (30), మరిజన్నె కాప్ (21) లు మాత్రమే కాస్త ప్రతిఘటించారు.
6/ 9
ఇంగ్లాండ్ బౌలర్ల జోరుకు దక్షిణాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. దీంతో, 137 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి.. టోర్ని నుంచి నిష్క్రమించింది సఫారీ జట్టు.
7/ 9
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చతికిలపడి ఫైనల్ కు చేరి కప్ కొట్టాలన్న ఆశను చేజేతులా కోల్పోయింది. అయితే, దక్షిణాఫ్రికాతో మ్యాచులో సెంచరీ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ డానియాల్ వ్యాట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
8/ 9
ఇప్పటివరకు మహిళల క్రికెట్ లో 11 వన్డే ప్రపంచకప్ లు జరుగగా అందులో ఆరు సార్లు ఆస్ట్రేలియా... 4 సార్లు ఇంగ్లాండ్.. ఒకసారి న్యూజిలాండ్ ట్రోఫీని దక్కించుకున్నాయి.