ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. 157 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.