మంధాన తో పాటు ఇతర విభాగాల్లో కూడా ఐసీసీ అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులలో పాకిస్థాన్ పంట పండింది. ఈ ఏడాది ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టుగానే గాక ఆటగాళ్ల పరంగా కూడా పాకిస్థానీలు అవార్డులను కొల్లగొట్టారు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఈయర్ గా కూడా ఆ జట్టుకే అవార్డులు దక్కాయి.