మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ (England) మహిళల జట్టు ఒకే ఒక్క వికెట్ తేడాతో న్యూజిలాండ్ (new Zealand)పై గెలుపొందింది. ఇప్పటికే మూడు మ్యాచ్ ల్లో ఓడిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి. అయితే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని నిలబడ్డ డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. (Photo: ICC)
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 134 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కివీస్ టీం కకావికలం అయ్యింది. న్యూజిలాండ్ ప్లయర్లలో మ్యాడీ గ్రీన్ (75 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. (Photo: ICC)
అయితే సోఫియా డంక్లీ (43 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేసింది. అయితే మెకాయ్ డంక్లీని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పరిస్థితి ఘోరంగా తయారైంది. అయతే టెయిలెండర్ ష్రుబ్ సోలే ఫోర్, సింగిల్ తీసి ఇంగ్లండ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నాట్ స్కీవర్ కు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ లభించింది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగింటిలో ఓడిన న్యూజిలాండ్ ప్రపంచకప్ నాకౌట్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. (Photo: ICC)