[caption id="attachment_1232334" align="alignnone" width="1600"] మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) టోర్నమెంట్ లో భారత మహిళల (india) జట్టు జూలు విదిల్చింది. నాకౌట్ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన చోటు సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీస్ (West Indies)తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా (Teamindia) 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచి మరో మ్యాచ్ లో ఓడిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. (PC: ICC TWITTER)
[caption id="attachment_1232336" align="alignnone" width="1600"] తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోరును చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మంధాన, యస్తిక భాటియా (21 బంతుల్లో 31; 6 ఫోర్లు) శుభారంభం చేశారు. ముఖ్యంగా యస్తిక ఫోర్లతో విండీస్ బౌలర్లపై చెలరేగింది. వీరిద్దరూ 6.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే దూకుడు మీదున్న యస్తిక భాటియాను మ్యాథ్యూస్ బోల్తా కొట్టించింది. దాంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj) (5) విఫలం కాగా.. దీప్తి శర్మ (15) నిరాశ పరిచింది. (PC: ICC TWITTER)
టీమిండియా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో 49/1 నుంచి 78/3గా నిలిచింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ మొదట ఆచి తూచి ఆడినా ఆ తర్వాత వేగం పెంచారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మంధాన ఆ తర్వాత వేగం పెంచింది. సిక్సర్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో మంధాన వెస్టిండీస్ పై (119 బంతుల్లో 123 ; 13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విరుచుకుపడింది. (PC: ICC TWITTER)
[caption id="attachment_1232340" align="alignnone" width="1080"] మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ శతకంతో (107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగింది. తొలుత అర్ధ సెంచరీ ఆ తర్వాత సెంచరీని పూర్తి చేసింది. హర్మన్, మంధాన మూడో వికెట్ కు 184 పరుగులు జోడించారు. దాంతో భారత్ 250 మార్కును దాటగలిగింది. మంధాన అవుటైన తర్వాత కాసేపటికే హర్మన్ ప్రీత్ కూడా అవుటవ్వడం... ఆ వెంటనే మరికొన్ని వికెట్లు పడటంతో భారత్ 317 పరుగుల వద్ద ఆగిపోయింది. సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. (PC: ICC TWITTER)
[caption id="attachment_1232342" align="alignnone" width="1080"] వెస్టిండీస్ జట్టు ఛేదనను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు డాటిన్ (46 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్), మ్యాథ్యూస్ (36 బంతుల్లో 43; 6 ఫోర్లు) తొలి వికెట్ కు 100 పరుగులు జోడించి శుభారంభం చేశారు. దాంతో విండీస్ భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. (PC: ICC TWITTER)