ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సీరీస్‌లో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు కోవిడ్-19 కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయింది. ఈ టెస్టు రద్దుపై బీసీసీఐ-ఈసీబీ మధ్య విభేదాలు కూడా వచ్చాయి. దీంతో సిరీస్ ఫలితం తేలకుండానే వాయిదా పడింది. (PC: ECB)
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకు ముందు టీమ్ ఇండియాలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఐదో టెస్టు రద్దు చేయాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కోరింది. ఈ విషయంపై బీసీసీఐ-ఈసీబీ అధికారుల మధ్య చర్చ జరిగింది. అయితే ఆ మ్యాచ్ ఫోఫిట్ (వాకోవర్) ఇవ్వాలని ఇంగ్లాండ్ కోరింది. కానీ, బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఐదో టెస్టు తర్వాత విడిగా ఆడాలని కోరింది. (PC: ECB)
ఈసీబీ వాకోవర్ ఇవ్వాలని కోరుతున్నది. అదే జరిగితే సిరీస్ 2-2తో సమానం అవుతుంది. అలా కాకుండా అదే మ్యాచ్‌ను విడిగా వచ్చే ఏడాది నిర్వహించాలని.. లేదంటే ముగిసిన సిరీస్ ఇండియా గెలిచిందని ప్రకటించి.. మిగిలిన టెస్టును ఏకైక టెస్టుగా నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నది. ఐసీసీ టెస్టు మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్న వెంటనే జులై 2022లో ఆ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. (PC: ECB)