ICC Test Rankings : ప్రమాదంలో కోహ్లీ స్థానం.. దుమ్మురేపిన రోహిత్ శర్మ.. సిరాజ్ దూకుడు..

ICC Test Rankings : టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). వన్డేల్లో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, టీ20, టెస్టుల్లో ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే, కోహ్లీ టెస్టు ర్యాంకు ప్రమాదంలో పడింది.