ICC TEST RANKINGS JOE ROOT GOES OVER VIRAT KOHLI FOR THE FIRST TIME SINCE NOVEMBER 2017 TEAM INDIA CAPTAIN DOWN TO FIFTH SRD
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ, రహానేకు షాక్.. మూడో స్థానానికి జో రూట్..
ICC Test Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్ గా టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. చెన్నై టెస్ట్ లో ఓటమి తర్వాత కేవలం ఇద్దరు టీమిండియా బ్యాట్స్ మెన్ మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లేటెస్ట్ గా టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. చెన్నై టెస్ట్ లో ఓటమి తర్వాత కేవలం ఇద్దరు టీమిండియా బ్యాట్స్ మెన్ మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు.
2/ 13
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. 2017 నుంచి టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ -3 లో ఉన్న కోహ్లీ..మొదటసారిగా ఐదో స్థానానికి పడిపోయాడు.
3/ 13
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్ ఖాతాలో ప్రస్తుతం 919 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
4/ 13
రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (891) ఉన్నాడు. విలియమ్సన్, రూట్ మధ్య కేవలం 36 పాయింట్ల వ్యత్యాసం ఉంది.
5/ 13
భారత్తో తొలి టెస్టులో డబుల్ సెంచరీతో విజృంభించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. రూట్ 883 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
6/ 13
ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ (878) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.
7/ 13
కోహ్లీ ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
8/ 13
పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ 760 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.
9/ 13
భారత టెస్టు స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. పుజారా ఖాతాలో ప్రస్తుతం 754 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
10/ 13
747 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ హెన్రీ నికోలస్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
11/ 13
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ 746 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
12/ 13
724 పాయింట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పదో స్థానం దక్కించుకున్నాడు.
13/ 13
చెన్నై టెస్టులో విఫలమవడంతో టాప్-10లో ఉండే అజింక్య రహానేకు ఈసారి చోటే దక్కలేదు.