లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒత్తిడి సమయంలో అతడు ఆడిన ఇన్నింగ్స్ ను అంత సులభంగా ఎవరూ మరిచిపోరు. ఛేజింగ్ లో ఇటువంటి ప్రదర్శనను కోహ్లీ ఇది వరకే చేసినా.. ఇది మాత్రం ప్రతి ఒక్క టీమిండియా అభిమానికి గుర్తుండి పోతుంది.
ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా ఉన్న కోహ్లీ.. చాలాకాలం తర్వాత గతేడాది నవంబర్ లో టీ20 ర్యాంకింగుల్లో తొలిసారి టాప్-10 నుంచి వైదొలిగాడు. వరుస వైఫల్యాలతో అతడి ర్యాంకింగ్ రోజురోజుకూ పడిపోయింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి లో తిరిగి టాప్-10లోకి వచ్చినా ఎక్కువ కాలం ఉండలేదు. మళ్లీ వరుసగా విఫలమై 35వ ర్యాంకుకు పడిపోయాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రోహిత్ శర్మను దాటేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మే టాప్ స్కోరర్. ఇది చెరిగిపోయింది. 2010-2022 మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీ 3,773 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 3,741 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.