ప్రస్తుతం టీమిండియా (Team India) అభిమానుల నోళ్లలో నానుతున్న ఆటగాడు దినేష్ కార్తీక్ (Dinesh Karthik). అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో యువ క్రికెటర్లకు తీవ్ర పోటీ ఇస్తున్నాడు.
టీమిండియాలోకి తారజువ్వలా దూసుకొచ్చిన కార్తీక్ కాక.. లేటెస్ట్ గా ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ అదే స్పీడ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్. సౌతాఫ్రికాతో సిరీస్ లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 46 యావరేజ్‌తో 158.62 స్ట్రైయిక్ రేటుతో 92 పరుగులు చేశాడు దినేశ్ కార్తీక్... నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ చేసి, 16 ఏళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే.