ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు నమీబియా ప్లేయర్ డేవిడ్ వీస్ కొట్టాడు. ఈ నమీబియా ఆల్ రౌండర్ నాలుగు మ్యాచుల్లో 8 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ వీస్ ఇది వరకు సౌతాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక, అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో ఎవిన్ లూయిస్ రెండో స్ధానంలో ఉన్నాడు. లూయిస్ 2 మ్యాచుల్లో ఏడు సిక్సర్లు బాదాడు.