ICC Best Playing XI : బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు
ICC Best Playing XI : బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు
ICC Best Playing XI : సోమవారం ఐసీసీ.. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించింది. టి20 ప్రపంచకప్ లో అద్భుతంగా ఆడిన ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ముగిసింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan)పై నెగ్గిన ఇంగ్లండ్ (England) రెండోసారి టి20 ప్రపంచకప్ విజేతగా అవరతరించింది.
2/ 8
సోమవారం ఐసీసీ.. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించింది. టి20 ప్రపంచకప్ లో అద్భుతంగా ఆడిన ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
3/ 8
ఇంగ్లండ్ నుంచి ఏకంగా నలుగురు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జట్టుకు నాయకుడిగా ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ జాస్ బట్లర్ ను ఎంపిక చేసింది.
4/ 8
భారత్ నుంచి విరాట్ కోహ్లీ.. సూర్యకుమార్ యాదవ్ లు మాత్రమే ఎంపికయ్యారు. హార్దిక్ పాండ్యాను 12వ ప్లేయర్ గా ఐసీసీ ఎంపిక చేసింది. ఓపెనర్లుగా ఇంగ్లండ్ ద్వయం జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ను ఎన్నుకుంది.
5/ 8
మూడో నంబర్ లో కోహ్లీని.. నాలుగో నంబర్ లో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకుంది. న్యూజిలాండ్ పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ కు ఐదో స్థానంలో తీసుకుంది. ఇక ఆల్ రౌండర్లుగా పాకిస్తాన్ ప్లేయర్ షాదబ్ ఖాన్ తో పాటు జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రాజాలను ఎంపిక చేసింది.
6/ 8
ఇక పేసర్లుగా స్యామ్ కరణ్ (ఇంగ్లండ్).. మార్క్ వుడ్ (ఇంగ్లండ్), అన్రిచ్ నోకియా (సౌతాఫ్రికా).. షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లను తీసుకుంది. వీరంతా టోర్నీలో అద్భుతంగా ఆడారు.
7/ 8
అయితే లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఈసారి చోటు దక్కించుకోలేదు.