టీ-20 ప్రపంచకప్ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్ అయిన బ్యాటింగ్ ఒక్కసారిగా "సూపర్ హిట్" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.
తొలి వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా.. 14 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ రికార్డ్‌ని బ్రేక్ చేశారు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో అప్పటి భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్- గౌతమ్ గంభీర్.. ఇంగ్లాండ్‌పై ఫస్ట్ వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డ్‌ని 140 పరుగులతో రోహిత్- రాహుల్ బ్రేక్ చేశారు.