లేటెస్ట్ గా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్(ICC T20 Rankings)లో ఏకంగా 68 స్థానాలు మెరుగుపర్చుకుని 7వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. సౌతాఫ్రికా సిరీస్ లో ఆడిన మూడు మ్యాచుల్లో ఇషాన్ 164 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్ 14 వ స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 16వ స్థానంలో, రోహిత్ శర్మ 17వ స్థానంలో ఉండగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ 2 స్థానాలు దిగజారి టాప్ 20లో కూడా చోటు కోల్పోయాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 21వ స్థానంలో ఉన్నాడు.