గాయాలు లేదా పనిభార నిర్వహణ కారణంగా కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే 20 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్ వన్డే జట్టు కోసం తీవ్ర పోటీ ఉంది. ప్రతి స్థానం కోసం ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇక, ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓపెనింగ్ స్లాట్ కోసం రోహిత్ తో పాటు ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం. (PIC: AP)
శిఖర్ ధావన్: వన్డే క్రికెట్లో శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఫార్మాట్ లో ధావన్ నిజంగానే గబ్బర్. ధావన్ 160 ODI ఇన్నింగ్స్‌లలో 44.98 సగటు.. 91.72 స్ట్రైక్ రేట్‌తో 6747 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. వన్డే ప్రపంచకప్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 53.70 సగటుతో 537 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. (PIC:AP)
రోహిత్ శర్మ: గత మూడేళ్లుగా టీ20 ఇంటర్నేషనల్స్‌పై దృష్టి సారించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పుడు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాడు. రోహిత్ ఇప్పుడు ODI జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ కూడా తన స్థానం కోసం కష్టపడాల్సి ఉంది. రోహిత్ ఇప్పటివరకు 226 ఇన్నింగ్స్‌లలో 48.58 సగటుతో 9376 పరుగులు చేశాడు. 17 వన్డే ప్రపంచకప్ ఇన్నింగ్సుల్లో 'హిట్‌మ్యాన్' 65.20 సగటుతో 978 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఖాతాలో ఆరు సెంచరీలు ఉన్నాయి. (PIC:AP)

KL రాహుల్: శిఖర్ ధావన్ గాయపడిన తర్వాత,.. KL రాహుల్ 2019 ODI ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ జోడిగా బరిలోకి దిగాడు. అయితే.. ఓపెనింగ్ పొజిషన్ కన్నా మిడిలార్డర్లో రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే, వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. అయితే ఏ ఆటగాడికి గాయమైనా.. రాహుల్ ఓపెనింగ్ కు సరిగ్గా సరిపోతాడు. (PIC: AP)
ఇషాన్ కిషన్: ఈ మధ్యకాలంలో భారత్ చాలా ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయత్నించింది. వారిలో ఇషాన్ కిషన్ కూడా ఒకడు. అయితే గతేడాది జులైలో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అతను అరంగేట్రం చేసినప్పటి నుంచి8 ODI ఇన్నింగ్స్‌లలో 33.37 సగటు..90.50 స్ట్రైక్ రేట్‌తో 267 పరుగులు చేశాడు. ICC ODI ప్రపంచ కప్ 2023 ఓపెనింగ్ స్థానం కోసం ఇషాన్ కిషన్ బలమైన పోటీదారు. (PIC:AP)
రుతురాజ్ గైక్వాడ్: ఇటీవల దేశవాళీ క్రికెట్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌కు 2023 వన్డే ప్రపంచకప్‌లో అవకాశం రావడం చాలా కష్టం. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సీనియర్ ఆటగాడు గాయపడితే.. రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇవ్వవచ్చు. గైక్వాడ్ 2022 అక్టోబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఒకే ఒక్క వన్డే ఆడి 19 పరుగులు చేశాడు. అయితే, ఈ యంగ్ బ్యాటర్ దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నారు. (PIC:AP)