[caption id="attachment_1258496" align="alignnone" width="1600"] ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వంలోని భారత్ న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టింది. భారత్ కు ప్రాక్టీస్ ఉండాలనే కారణంతో బీసీసీఐ నెలరోజులకు ముందుగానే మన జట్టును అక్కడకు పంపింది. (PC: ICC)
[caption id="attachment_1258506" align="alignnone" width="1080"] తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. ఈ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం. ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. (PC: ICC)
ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్). (PC: ICC)