ICC ODI Rankings : దిగజారిన కోహ్లీ, రోహిత్ ర్యాంకులు.. ప్రస్తుతం ఏ స్థానాల్లో ఉన్నారంటే?
ICC ODI Rankings : దిగజారిన కోహ్లీ, రోహిత్ ర్యాంకులు.. ప్రస్తుతం ఏ స్థానాల్లో ఉన్నారంటే?
ICC ODI Rankings : టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఎక్కువగా వన్డే మ్యాచ్ లు ఆడలేదు. దాంతో అదికాస్తా వీరిద్దరి వన్డే ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన తర్వాత భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వీరు న్యూజిలాండ్ (New Zealand) పర్యటనకు దూరంగా ఉన్నారు.
2/ 8
టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఎక్కువగా వన్డే మ్యాచ్ లు ఆడలేదు. దాంతో అదికాస్తా వీరిద్దరి వన్డే ర్యాంకింగ్స్ పై ప్రభావం చూపింది.
3/ 8
తాజాగా ఐసీసీ ప్రకటించిన పురుషుల బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒక్కో స్థానం కిందికి దిగజారారు. విరాట్ కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు.
4/ 8
ఇక రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. భారత్ ఈ ఏడాది మరో వన్డే సిరీస్ ను ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది.
5/ 8
ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణిస్తే వీరి ర్యాంక్ లు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ 27వ స్థానంలో నిలిచాడు.
6/ 8
ఇక తొలి వన్డేలో సెంచరీతో అదరగొట్టిన కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. ఏకంగా 10 స్థానాలు పైకి ఎగబాకి 18వ స్థానంలో నిలిచాడు.
7/ 8
ఇక ఇదే మ్యాచ్ లో 98 పరుగులతో అజేయంగా నిలిచిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ తన 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక భారత్ తో జరిగిన మూడో వన్డే కూడా వర్షంతో రద్దయ్యింది.
8/ 8
దాంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కివీస్ 1-0తో సొంతం చేసుకుంది. టి20 సిరీస్ ను సాధించిన భారత్.. శిఖర్ ధావన్ నాయకత్వంలో వన్డే సిరీస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.