హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

ICC Cricket World Cup 2019: వైభవంగా క్రికెట్ వరల్డ్‌కప్ ప్రారంభ వేడుక... ముఖ్యఅతిథులు వీళ్లే...

ICC Cricket World Cup 2019: వైభవంగా క్రికెట్ వరల్డ్‌కప్ ప్రారంభ వేడుక... ముఖ్యఅతిథులు వీళ్లే...

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడూ అని ఆతృతగా ఎదురుచూస్తున్న క్రికెట్ వరల్డ్‌కప్ 2019... అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లోని లండన్ నగరంలో వినూత్నంగా నిర్వహించిన వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు... క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలో ‘మాల్‌’లో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు నోబెల్ ప్రైజ్ గ్రహీత మాలాలా యూసుఫ్, బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వెస్టిండీస్ మాజీ దిగ్గజ ప్లేయర్ వీవ్ రిచర్డ్స్, స్ప్రింటర్ యొహాన్ బ్లేక్, భారత మాజీ లెజెండరీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ఈ వేడుకకు హాజరయ్యారు. 2015 వరల్డ్‌కప్ విజేత ఆసీస్ జట్టుకు సారథ్యం వహించిన మైకెల్ క్లార్క్... వరల్డ్‌కప్ ట్రోఫీని వేదికపైకి తీసుకొచ్చాడు.

Top Stories