ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ (IPL 2022 Final) కి రంగం సిద్ధమైంది. మెగాఫైట్ కు మరికొన్ని గంటల సమయం ఉంది. ఈ సీజన్ అంతటా నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది.
ఐపీఎల్‌ను, అంతర్జాతీయ క్యాలెండర్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని ఐసీసీ ఛైర్మన్ కి ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు. " ఐపీఎల్ వంటి టీ20 లీగులు సభ్య దేశాల పరిధిలోకి వచ్చే అంశం. ఈ పోటీలను వారు కోరుకున్నట్లు నిర్వహించుకోవచ్చు. అయితే ఈ తరహా పోటీల వ్యవధి పెరిగి దీర్ఘకాలంగా సాగితే.. అంతర్జాతీయ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అక్కడ మ్యాచుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది' అని బార్క్లే పేర్కొన్నాడు.
"సంవత్సరానికి 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆటగాళ్లను ఆకర్షించే క్రికెట్ లీగ్‌ల సంఖ్య పెరిగితే, మరేదైనా టోర్నమెంట్ లేదా సిరీస్‌ల సంఖ్యను తగ్గించాల్సి వస్తోంది. ఈ లీగ్‌తో ఐసీసీ టోర్నీలపై ఎటువంటి ప్రభావం చూపదు. ఐసీసీ టోర్నీలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ పోటీల్లో సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. అందువల్ల ఈ లీగ్ వ్యవధిని పొడిగిస్తే ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రమే తక్కువగా జరుగుతాయ్' అని ఆయన తెలిపారు.