జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ వేటు వేసింది. స్పాట్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో బుకీలతో చర్చలు జరిపినట్లుగా తేలడంతో నిషేదం విధించింది.
2/ 8
స్పాట్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని టేలర్ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని అవినీతి నిరోదక విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఐసీసీ మూడున్నర ఏళ్ల పాటు నిషేదం విధించింది.
3/ 8
ఈ నిషేధం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని తెలిపింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించాడని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
4/ 8
టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై పూర్తి విచారణ జరిపించిన ఐసీసీ ఆతను చేసిన తప్పులకు అనుగూణంగానే నిషేదం విధించింది. గతంలో ఓ ఇండియన్ బిజినెస్మెన్ క్రికెట్ లీగ్‌పై మాట్లాడలని భారత్‌కు పిలిపించిన విషయాన్ని లేఖలో వెల్లడించాడు.
5/ 8
అక్కడికి వెళ్లిన సమయంలో తనకు డ్రగ్స్‌తో పార్టీ ఇచ్చి ..డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారంటూ టేలర్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడమని 15వేల డాలర్లతాను ఇచ్చినట్లుగా లేఖలో వెల్లడించారు.
6/ 8
అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ ఐసీసీ బ్రెండన్ టేలర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే అతనిపై నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించింది.
7/ 8
2004 నుంచి 2021 మధ్య కాలంలో బ్రెండన్ టేలర్ జింబాబ్వే తరపున అన్నీ ఫార్మెట్లలో కలిపి 284 మ్యాచ్‌లు ఆడాడు.
8/ 8
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో మొత్తం 9,9,38 పరుగులు చేసిన టేలర్ 17సెంచరీలు చేశాడు. ఈవ్యవహారంలో టేలర్ చేసిన తప్పులను అంగీకరించడం వల్లే నిషేదం విధించినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.