టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2021గా పాక్ ప్లేయర్..మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేసిన ఐసీసీ
టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2021గా పాక్ ప్లేయర్..మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేసిన ఐసీసీ
Mohammad Rizwan: టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటను ప్రదర్శించిన పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ టీ 20ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎంపిక చేసింది ఐసీసీ. ఆడిన 29మ్యాచ్‌లలో 1326 రన్స్ చేసిన అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు రిజ్వాన్.
పాకిస్తాన్ క్రికెటర్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు టీ 20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021అవార్డు దక్కింది. 2021వ సంవత్సరానికి గాను రిజ్వాన్ కనబర్చిన అద్భుతమైన ఆట తీరును బట్టి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.
2/ 6
టీ ట్వంటీ వరల్డ్ టోర్నీలో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు పాక్ క్రికెటర్ రిజ్వాన్. మొత్తం 29మ్యాచ్‌లు ఆడితే అందులో 1326 రన్స్ చేశాడు రిజ్వాన్.
3/ 6
గతేడాది జరిగిన టీ ట్వంటీ సమరంలో ఆడిన 29 మ్యాచ్‌లలో రిజ్వాన్ ఓపెనర్‌గా దిగి అత్యధిక పరుగులు చేశాడు. 1326 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ సగటు 73.66 ఉండగా స్ట్రయిక్ రేట్ 134.89 ఉంది.
4/ 6
గతేడాది జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కి చేరడంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ మెయిన్ రోల్ పోషించాడు. ఆ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా రిజ్వాన్ నిలిచాడు.
5/ 6
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా రిజ్వాన్ ఎంపిక చేయగా..ఐసీసీ వర్దమాన క్రికెటర్‌గా సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్‌గా జెన్మన్ మలన్ని ఎంపిక చేసింది ఐసీసీ.
6/ 6
ఐసీసీ వర్దమాన క్రికెటర్‌గా ఎంపికైన మలాన్ ప్రస్తుతం సౌతాఫ్రికా , భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ అనుబంధ దేశాల ఈ ఏటి మేటి క్రికెటర్‌గా జీషన్ మక్సూద్ని ఎంపిక చేసింది ఐసీసీ.