Rishabh Pant : ‘పంత్ ను లాగి పెట్టి కొట్టాలనుంది.. ఏ మాత్రం బాధ్యత లేదు’ సంచలన కామెంట్స్ చేసిన లెజెండరీ క్రికెటర్
Rishabh Pant : ‘పంత్ ను లాగి పెట్టి కొట్టాలనుంది.. ఏ మాత్రం బాధ్యత లేదు’ సంచలన కామెంట్స్ చేసిన లెజెండరీ క్రికెటర్
Rishabh Pant : ఆ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో భయపటపడ్డ రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు తెగిపోయాయి. అయితే వీటికి డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు.
గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో భారత (India) వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై మంటల్లో పూర్తిగా కాలిపోయిన సంగతి తెలిసిందే.
2/ 7
ఆ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో భయపటపడ్డ రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు తెగిపోయాయి. అయితే వీటికి డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు.
3/ 7
ప్రస్తుతం కోలుకుంటున్న రిషభ్ పంత్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత అతడిని లాగి పెట్టి కొట్టాలని ఉందంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
4/ 7
టీమిండియా తరఫున ఆడుతూ ఏ మాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేయడం పంత్ తప్పని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్, టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ పెట్టుకుని పంత్ నిర్లక్ష్యంగా ఉండటం తనకు ఆగ్రహాన్ని తెప్పిస్తుందన్నాడు.
5/ 7
‘పంత్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ, అతడు బాధ్యత లేకుండా చేసిన పనిని సమర్ధించబోను. అతడు గాయపడటం వల్ల టీమిండియా కాంబినేషన్ పూర్తిగా మారిపోయింది. ఇది టీంకు మంచిది కాదు’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
6/ 7
కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ పూర్తిగా కోలుకుని టీమిండియాకు కమ్ బ్యాక్ చేసేందుకు ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రమాదంలో అతడి కుడి మోకాలు బాగా దెబ్బతింది.
7/ 7
కోలుకున్న అతడు మళ్లి వికెట్ కీపింగ్ చేస్తాడా అనేది అనుమానమే. అయితే అతడు త్వరగా కోలుకుని తిరిగి టీమిండియా తరఫున పునరాగమనం చేయాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.