అయితే సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా పొలార్డ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టి20 ఫార్మాట్ లో 600 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా పొలార్డ్ నిలిచాడు. తన 600వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. (PC : ESPN Cricinfo)
వన్డే, టెస్టు ఫార్మాట్ లలో పెద్దగా రాణించలేకపోయిన పొలార్డ్. టి20 ఫార్మాట్ లో మాత్రం అదరగొట్టాడు. 600 మ్యాచ్ ల్లో 31.34 సగటుతో 11,723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. 56 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 309 వికెట్లు పడగొట్టిన పొలార్డ్ అత్యుత్తమ బౌలింగ్ 4/15 గా ఉంది. దాదాపు 15 ఏళ్ల నుంచి టి20లు ఆడుతున్న పొలార్డ్ వెస్టిండీస్‌తో పాటు ఎన్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
దేశవాలీలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో డాకా గ్లాడియేటర్స్, డాకా డైనమిటీస్, పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మికి పొలార్డ్ ప్రాతినిధ్యం వహించాడు.