"జెర్సీ నోస్ నో జెండర్" ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్‌గా మారింది. 2018 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మద్దతు తెలపడానికి స్టార్ట్ చేసిన ఈ క్యాంపెయిన్‌కు...టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మద్దతు తెలపడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్యాంపెయిన్‌లో ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రెజ్లర్ వినేష్ ఫోగట్, భారత క్రికెటర్లు కె ఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ సైతం భాగమయ్యారు. బాలీవుడ్ స్టార్ సుశాంగ్ సింగ్ రాజ్‌పుత్, బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ సైతం టీమిండియా ఉమెన్స్ టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.