ఇటీవల శ్రీలంక గడ్డపై యంగ్ టీమిండియాకు నాయకత్వం వహించి మంచి పేరు సంపాందించుకున్నాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan). గబ్బర్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ ను దక్కించుకోగా.. ఆ తర్వాత జరిగిన టీ-20 సిరీస్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆన్ ఫీల్డ్ లో మనోడి సూపర్ జోష్ లో ఉంటాడు. ఆఫ్ ఫీల్డ్ లో కూడా గబ్బర్ స్టైలే వేరు. (Photo Credit : Instagram)
అయేషా, భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి ఫేస్బుక్ ఫ్రెండ్. శిఖర్ ధావన్, భజ్జీ ఫేస్బుక్లో అయేషా ఫోటో చూశాడు. తొలి చూపులోనే ఆయేషా ప్రేమలో పడిన ధావన్, వెంటనే ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. భజ్జీ స్నేహితుడు కావడంతో శిఖర్ ధావన్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను వెంటనే యాక్సెప్ట్ చేసింది అయేషా. అలా ఫేస్బుక్ ఛాటింగ్ ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.(Photo Credit : Instagram)
అయేషాతో పాటు సమయం దొరికినప్పుడల్లా కూతుళ్లతో కలిసి గడపడానికి ఆస్ట్రేలియా వెళుతూ ఉంటాడు శిఖర్ ధావన్. పెళ్లి తర్వాత క్రికెటర్‌గా అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్, ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గబ్బర్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే.. టీమిండియా వరల్డ్ కప్ టీ-20 కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. (Photo Credit : Instagram)