సీక్రెట్ లవర్ గురించి చెప్పేసిన కాజల్ అగర్వాల్... హిట్ మ్యాన్ అంటే చచ్చేంత ఇష్టమట...

హీరోయిన్ కాజల్ అగర్వాల్ జోరు మామూలుగా లేదు. టాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘సీత’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్... కోలీవుడ్‌లో మూడు సినిమాలతో యమా బిజీగా ఉంది. విశ్వనాయకుడు కమల్ హాసన్‌కు జోడిగా ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్, ‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’, ‘కోమలి’ సినిమాల్లోనూ నటిస్తోంది. ఆ మధ్య రిలీజైన ‘పారిస్ పారిస్’ టీజర్‌లో కాజల్ అగర్వాల్ ఎద అందాలను టచ్ చేస్తున్న సీన్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని, తల్లి కూడా అయినా... కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లి విషయం ఎత్తలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సీక్రెట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.