19 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా భారత్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి నెగ్గింది. 2004లో ఆసీస్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015,2017,2020లో భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్ జరిగిన ప్రతీసారి ఏదో ఒక వివాదం జరగడం కామన్‌గా మారిపోయింది. గతంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో జరిగిన వివాదలపై అభిమానులు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. Image from Twitter/toisports
2013 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను మధ్యలోనే సస్పెండ్ చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో నాలుగు రోజుల్లోనే ఓటమి పాలైంది ఆసీస్. ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కోచ్ మిక్కీ ఆర్థర్ తమ ఆటగాళ్లను మూడు అంశాలపై హోం వర్క్ చేసి దాన్ని సమర్పించాలని కోరాడు. షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్, ఉస్మాన్ ఖవాజా, జేమ్స్ ప్యాటిన్సన్ మినహా మిగతా ఆటగాళ్లంతా ఈ వర్క్ చేశారు. కోచ్ ఆదేశాలను ఈ నలుగురు ఆటగాళ్లు పాటించకపోవడంతో వారిని సస్పెండ్ చేశారు. తర్వాతి టెస్టు ఆడేందుకు అనుమతించలేదు. ఈ నిర్ణయం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపింది. Image Source Sportskeeda
2008లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మంకీగేట్ వివాదం తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ - ఆండ్రూ సైమండ్స్ మధ్య ఈ వివాదం మొదలైంది. ఇద్దరూ గ్రౌండ్‌లోనే వాదనలకు దిగారు. సైమండ్స్ మీద ఆగ్రహంతో తెరి మా.... అని హర్భజన్ సింగ్ తిట్టాడు. ఈ పదం సైమండ్స్‌కు మంకీ లాగా వినిపించింది. హర్భజన్ తన పట్ల జాత్యాహంకారం చూపించాడని, తనను మంకీ అని పిలిచాడని సైమండ్స్ ఆరోపించాడు. దీంతో హర్భజన్ సింగ్‌పైన ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆయనపైన మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అయితే, వివాదం జరిగిన సమయంలో హర్భజన్‌తో పాటు సచిన్ టెండుల్కర్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. సైమండ్స్పైన జాత్యాంహాకరపూరితంగా హర్హజన్ ఎలాంటి మాట అనలేదని సచిన్ టెండుల్కర్ వివరణ ఇచ్చారు. దీంతో హర్భజన్పైన నిషేదం ఎత్తేసి జరిమానా వింధించింది ఐసీసీ. Image Source Sportskeeda
2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ జాతి వివక్షకు గురయ్యాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆసీస్ అభిమానులు సిరాజ్ పాటు బుమ్రాపై జాతివివక్షతో దూషించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఈఘటనలో మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సిరాజ్‌పై ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయాల్సింది కాదని నాటి ఆసీస్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇండియా సిరీస్‌ను రద్దు చేసుకుందామని ప్రతిపాదిస్తే ఒప్పుకునే వాళ్లమని.. కానీ అలా జరగకుండా ఈ వ్యవహారాన్ని ఇండియా బాగా హ్యాండిల్ చేసిందని పైన్ అభిప్రాయపడ్డాడు. Image Source Sportskeeda
2017 బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్రెయిన్ ఫేడ్ చర్య తీవ్ర వివాదానికి కారణమైంది. ఐసీసీ నిబంధలను అనుసరించి అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దానిని మరోసారి సరి చూసుకోవాల్సిందిగా కోరే సమయంలో మైదానంలో ఉన్నవారి నుంచి మాత్రమే సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఫీల్డింగ్ చేస్తున్నట్టు జట్టు అంపైర్ డిసిషన్ రివ్యూ డిఆర్ఎస్కు వెళ్లాలనుకుంటే, ఆ జట్టు కెప్టెన్ మైదానంలో ఉన్న మిగతా ఆటగాళ్లను సంప్రదించవచ్చు. అదే విధంగా బ్యాటర్ అప్పీల్ చేయలనుకుంటే, తనతో కలిసి క్రీజ్‌లో ఉన్న మరో బ్యాటర్‌తో చర్చించవచ్చు. అంతేగానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్లో లేని వారి నుంచి సలహాలు తీసుకోకూడదు. 2017 బెంగళూరులో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్కు అప్పీల్ చేయడానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడు. అక్కడి నుంచి ఏవైనా సూచనలు వస్తాయేమోనని అనుకున్నాడు. ఈ వ్యవహారం పెద్ద దుమారానే్న రేపింది. స్మిత్ వైఖరిని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు పట్టాడు. తాను డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడడం తప్పేనని అంగీకరించిన స్మిత్ ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని చెప్పాడు. మెదడు పనిచేయలేదని, ఏం చేస్తున్నాన్నది తెలియకుండానే డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశానని స్మిత్ వివరణ ఇచ్చుకున్నాడు.