అయితే హాకీ ప్రపంచకప్ లో మాత్రం దాయాది దేశం పాకిస్తాన్ రికార్డు భారత్ కంటే మెరుగ్గా ఉంది. పాకిస్తాన్ ప్రపంచకప్ ను ఏకంగా నాలుగు సార్లు నెగ్గి అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఉంది. 1971, 1978, 1982, 1994 వరల్డ్ కప్ లలో నాలుగు సార్లు చాంపియన్ గా నిలిచింది. మరో రెండు సార్లు రన్నరప్ (1975, 1990)గా నిలిచింది.