Rohit: కెప్టెన్ గా సూపర్ ‘హిట్’మ్యాన్.. విరాట్ కోహ్లిని దాటేశాడు.. రికార్డులను కుమ్మేశాడు.. ఇవే ఆ రికార్డులు

Ro‘hit’ Sharma:పూర్తిస్థాయి టీ 20 కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న తొలి సిరీస్ లోనూ రోహిత్ శర్మ రికార్డుల వరద పారిస్తున్నాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను కెప్టెన్ గా క్లీన్ స్వీప్ చేసిన హిట్ మ్యాన్.. బ్యాటర్ గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.