దీంతో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీంతో వన్డే వరల్డ్ కప్ -2023లో భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు ముందు, వన్డే జట్టు కూర్పుపై ప్రయోగాలు చేయడానికి టీమ్ మేనేజ్మెంట్కు ఇంకా 10 నెలల సమయం ఉంది.
టీమ్ మేనేజ్మెంట్ వన్డే వరల్డ్ కప్-2023 కోసం బౌలింగ్ విభాగంపై ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంది. ఇటీవల కాలంలో భారత్ బౌలింగ్ దళం దారుణంగా విఫలమవుతుంది. టీమ్ భారీ స్కోర్ చేసినా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 దృష్టిలో ఉంచుకుని జట్టులో చేయాల్సిన మార్పులపై క్రికెట్ పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
* బ్యాకప్ ఆల్-రౌండర్లు కీలకం : ఇప్పటికే హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి సార్ట్ ఆల్ రౌండర్లు ఉన్నా.. టాప్ సిక్స్‌లో బ్యాటింగ్‌తో పాటు, కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే బ్యాకప్ ఆల్-రౌండర్లు జట్టుకు చాలా అవసరం. స్పెషలిస్ట్ బౌలర్లలో ఒకరికి ఆఫ్ కోటా ఇచ్చినప్పుడు ఈ బ్యాకప్ ఆల్ -రౌండర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. బ్యాకప్ ఆల్ రౌండర్ల జాబితాలో కృనాల్ పాండ్యా, వెంకటేశ్ అయ్యార్, రిషి ధావన్ ఉండాలంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్.
* రిషి ధావన్ : ఇతను 2016లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచుల్లో రెండు సార్లు బ్యాటింగ్‌కు అవకాశం వచ్చింది. మొత్తంగా 12 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు. ఆ తరువాత వన్డేలకు ఎంపిక కాలేదు. 2021-22 విజయ్ హజారే ట్రోఫీలో ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 458 పరుగులు చేసి 17 వికెట్లు తీశాడు. ఈ గణాంకాలను చూస్తే రిషి ధావన్ అంతర్జాతీయ వేదికపై మరో అవకాశాన్ని పొందేందుకు అర్హుడని చెప్పవచ్చు.
కృనాల్ కెరీర్లో ఐదు వన్డేలు ఆడాడు. 101.36 స్ట్రైక్ రేట్‌తో 130 పరుగులు చేశాడు. అలాగే రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. పస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో 83 లిస్ట్-ఎ మ్యాచులు ఆడి 2,375 పరుగులు చేశాడు. అంతేకాకుండా 100 వికెట్లు తీసుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ -2023 జట్టు సభ్యుల్లో కృనాల్ పాండ్యా కూడా ఉంటే అది భారత్‌కు మేలు చేయవచ్చు.
* వెంకటేశ్ అయ్యర్ : ఈ ఆల్‌రౌండర్ ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెంకటేశ్ రెండు మ్యాచ్ లు ఆడాడు. కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 5 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అప్పటి నుంచి వెంకటేష్ అయ్యర్ భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడలేదు.
లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం అయ్యర్‌కు అద్భుత రికార్డు ఉంది. ఈ ఆల్ రౌండర్ 32 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. 30 ఇన్నింగ్స్‌లలో 1,252 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో అతని బ్యాటింగ్ సగటు 48.15 కాగా, అతని స్ట్రైక్ రేట్ 105.83. బౌలింగ్ లో అతను 19 వికెట్లు తీశాడు. ఇతన్ని టీమ్ మేనేజ్మెంట్ మరింతగా తీర్చిద్దితే 2023 ప్రపంచకప్‌లో భారత్ తరపున అతిపెద్ద మ్యాచ్ విన్నర్లలో ఒకడు కాగలడు.