ఇవేకాకుండా ఎంఎస్ ధోనీ చాలా బ్రాండ్లను బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. గోడాడీ, స్నైకర్స్, వీడియోకాన్, బూస్ట్, ఓరియెంట్ ఎలక్ట్రిక్, నెట్‌మెడ్స్ వంటి వాటికి అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇంకా స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ధోనీకి కంపెనీ కూడా ఉంది. దీని కింద దేశవ్యాప్తంగా 200 జిమ్‌లు ఉన్నాయి. ఇంతటితో ధోనీ లిస్ట్ అయిపోలేదు. ఝార్ఖండ్‌లో హోటల్ మహి రెసిడెన్సీ పేరుతో పెద్ద హోటల్ ఉంది.